83 మూవీ – రివ్యూ

రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె, పంకజ్‌ త్రిపాఠి, తాహిర్‌ రాజ్, జీవా తదితరులు న‌టించిన చిత్రం 83. భారతదేశం తొలిసారి క్రికెట్‌లో ప్రపంచకప్‌ గెలిచిన సందర్భం.. క్రికెట్‌ అభిమానులకే కాదు.. ప్రతి ఒక్క భారతీయుడి గుండె ఉప్పొంగిపోయిన సంవత్సరం అది. అందుకనే ఆనాటి జ్ఞాప‌కాల‌ను తెర పై ఆవిష్క‌రించాల‌ని క‌బీర్ ఖాన్ 83 చిత్రాన్ని తెర‌కెక్కించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్‌ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కా ప్రొడక్షన్స్, నదియవాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్‌ఖాన్‌ ఫిల్మ్స్ సంయుక్తంగా 83 చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం ఈరోజు అన‌గా డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. 83 ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే.. ముందుగా క‌థ చెప్పాలి.

క‌థ

భార‌త క్రికెట్ చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం 1983. భారత జట్టు ప్రపంచ కప్‌ పోటీల కోసం ఇంగ్లండ్‌ బయలుదేరడంతో కథ మొదలవుతుంది. జట్టు మీద ఉన్న తక్కువ అంచనాలను చూపిస్తూ.. సభ్యులను పరిచయం చేస్తూ.. ఎలాంటి బోరింగ్ సీన్స్ పెట్ట‌కుండా ప్రేక్ష‌కుల్ని డైరెక్ట్ గా కథలోకి దించేశాడు దర్శకుడు. 1983 టైమ్ లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, ఆ క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏంటి.? ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? టీమ్ ఇండియా ఎలా కప్ గెలిచారు ? అలాగే కపిల్ దేవ్ జీవితం గమనం ఏమిటి ? అనేది మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్
రణ్‌వీర్‌సింగ్ న‌ట‌న‌
క‌థ‌, క‌థ‌నం
ద‌ర్శ‌క‌త్వం ప్ర‌తిభ‌
టెక్నిక‌ల్ టీమ్ వ‌ర్క్

మైన‌స్ పాయింట్స్
అక్క‌డ‌క్క‌డా డ్రమెటిక్ గా ఉండ‌డం
ర‌న్ టైమ్

విశ్లే�