‘దసరా’ USA రివ్యూ ..!

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదేల తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా. సింగరేణి నేపథ్యంలో రూపొందించిన ఈ ను తెలుగుతోపాటు..
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్ . మరి ఈ సినిమా ఎలా ఉందొ మన revirew లో చూద్దాం .


అమెరికాలో ముందే ప్రీమియర్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చూసి మా usa జర్నలిస్ట్ శివకుమార్ అందించిన రిపోర్ట్ మీకు అర్ధం అయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాను .

ముందుగా కథలోకి వెళితే ..

సింగరేణి బొగ్గు గనుల్లో పని చేసే ధరణి ఎప్పుడు అల్లరి చిల్లరగా ఉంటాడు . ఇందులో సిల్క్ స్మితకు నాని పెద్ద ఫ్యాన్ . దోస్తులతో దావత్ , వెన్నెలతో ప్రేమ , ఇలా సాగిపోతున్న ధరణి జీవితం లో అనుకోని మలుపు ఎదురవుతుంది . ఒక కాంట్రాక్టర్ చేసే దౌర్జన్యాన్ని ఎదిరించి యుద్దానికి దిగుతాడు . అదేనా సమయం లో ధరణి ఫ్రెండ్ చిక్కులో పడతాడు , అతడిని కాపాడడానికి ధరణి ఎం చేసాడు . ధరణి పెళ్లి చేసుకోవాలనుకున్నవెన్నలని కాంట్రాక్టర్ ఎం చేసాడు . స్నేహితుడు పరిస్థితి ఏంటి ..? అనేది మిగిలిన కథ ,

నేను చాల సింపుల్గా చెప్పాను కానీ చెప్పినంత ఈజీగా లేదు సినిమా ..

అసలు తెర మీద బొమ్మ పడ్డ దగ్గరి నుండి మనం ఆ సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్నాం అనే ఫీలింగ్ తీసుకువచ్చారు . ధరణి పాత్రతో మనం ట్రావెల్ అయిపోతాం . ధరణి ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ మనకి కూడా ఉండాలి అని ఫీల్ అవుతాం . వెన్నలలాంటి అమ్మాయి ప్రేమ లేకపోతే అసలు ఈ బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది . రావణాసురుడి లాంటి విలన్ ఎదిరితే ఒక సామాన్యుడు రాముడిలా మారి ఆ విలన్ ని ఎలా సంహరించాడు .


బడుగు బలహీన వర్గాలను ఎలా రక్షించాడు అనేది సూపర్ ఉంటుంది . మనం కూడా ఒక శ్రీరాముడిలా ఉండాలి అనిపిస్తుంది . ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒకలెక్క అని చాల ప్రెస్ మీట్ ల నాని చెబుతుంటే కాస్త ఓవర్ అని ఫీల్ అయ్యాం కానీ . సినిమా చూసాక నాని చెప్పింది నిజమే అనిపిస్తుంది .

ఇక నటీనటుల విషయానికి వస్తే . ముందుగా చెప్పాల్సింది . ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి , అయన విలన్‌ పాత్రలో సింపుల్ గా కనిపిస్తూ కళ్ళలో క్రూరత్వం పలికించాడు . హీరోకి బాల ఏమైనా విలన్ ఉంటె సినిమా ఎలా ఎలివేట్ అవుతుందో మనకి తెలిసిందే , అందుకు తగినట్లే ఈ బలమైన విలన్ దసరా సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలిపాడు .

ఇక నెక్స్ట్ వచ్చేసి నాని ఫ్రెండ్ గా చేసిన దీక్షిత్ శెట్టి గురించి చెప్పాలి . ఈ కన్నడ నటుడు , చాల అందంగా ఉంటాడు .కానీ ఈ సింగరేణి బొగ్గు గనుల్లో , ఈ రస్టిక్ పాత్రలో ధరణి కి సపోర్ట్ గ నిలిచే పాత్రలో సూపర్ చేసాడు . ఆ పాత్రలో ఉండే ఆర్క్ చివరి వరకు మైన్టైన్ చేయడం లో దీక్షిత్ శెట్టి సక్సెస్ అయ్యాడు . ఇక నుండి ఆయనకి టాలీవుడ్ లో మంచి పాత్రలు దొరుకుతాయి .

అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్నల పాత్ర చేసిన మహానటి కీర్తి సురేష్ గురించి . ఇందులో చిన్నప్పటి నుండి ధరణి ని లవ్ చేస్ వెన్నెల పాత్ర అద్భుతంగా చేసింది కీర్తి . ఆమె ఎప్పటి లాగే పాత్ర లో ఒదిగిపోయింది .
వెన్నెల పాత్రలో కీర్త్తి ని తప్ప ఇంకా ఎవరిని ఇమేజ్ చేసుకోలేము అనే రేంజ్ లో ఆ పాత్రకి జీవం పోసింది . స్పెషల్ గ చెప్పాలంట క్లైమాక్స్ పోర్షన్లో వచ్చే సెంటి మెంట్ సీన్స్ లో అయితే ఆమె నటనకి మనం కూడా కన్నీళ్లు పెడతాం .

ఇక ఫైనల్ గా నేచురల్ స్టార్ నాని గురించి ఎంతచెప్పినా తక్కువే , ఫస్ట్ టైం మాస్ పాత్రలో చేసిన నాని , తెర మీద కనబడిన ఫస్ట్ ఫ్రేమ్ నుండే మనల్ని తన తో ట్రావెల్ చేసేలా చేయడం లో మరో సారి విజయం సాధించాడు . నాని కనిపించిన ప్రతి సారి తన యాక్టింగ్ లో కొత్తదనం ఉంటుంది . అంత కష్టమైన సీన్ ని చాల ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు . ఒక సారి ఫ్రెండ్స్ తో దావత్ , వెన్నెలతో రొమాన్స్ , విలన్ తో ధమ్కీ , ఇలా ప్రతి సీన్ లో కూడా తన కళ్ళతో కట్టిపడేసాడు నాని . అల్లు అర్జున్ కి పుష్ప ఎలాగో దసరా మూవీ లో ధరణి పాత్ర నానికి అలాగే లైఫ్ మొత్తం వెంటాడుతూ ఉంటుంది .

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి . అయన డైరెక్షన్ మాములుగా లేదు , ఫస్ట్ టైం చేసినట్లు అసలు ఉండదు . ఇక ఎమోషన్ క్యారీ చేసే సీన్లు , యాక్షన్ ఎపిసోడ్స్ డిసిన్ చేసిన తీరు , అలాగే ధరణి పాత్రని మన బ్రెయిన్ లో ఎక్కించే తీరు నెక్స్ట్ లెవల్ . నాని చెప్పినట్లు శ్రీకాంత్ టాలీవుడ్ కి మరొక రాజ మౌళి అనడం లో ఎలాంటి సందేహం లేదు .

ఇక సినిమాల్లో మరో హైలెట్ సంతోష్ నారాయణ మ్యూజిక్ , అయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎంత ఫేమస్ మనకి తెలుసు , అందుకు తగినట్లే అయన ఇచ్చిన మాస్ మ్యూజిక్ , అలాగే పాటలు సూపర్ యిన్నాయ్ .

ఇక మరొక ఇంపార్టెంట్ విషయానికి వస్తే ,సినిమాటోగ్రాఫర్ , ఇది కూడా సినిమాకి చాల బాగా వర్క్ అవుట్ అయ్యింది . ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగా తెలిసేలా విజువల్స్ , ఉన్నాయ్ . సింగరేణి టెక్చర్ స్క్రీన్ మీద బాగా క్యారీ అయ్యేలా చూసారు .

ఇక ఫైనల్ గ దసరా పర్ఫెక్ట్ మాస్ మసాలా బ్లాక్ బ్లాస్టర్ మూవీ . మాకు అయితే బాగా నచ్చింది , మీకు కూడా సినిమా నచ్చిందా అయితే మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి .

Related Posts