కొత్త పెళ్లికూతురుతో విజయ్ సేతుపతి రొమాన్స్

విజయ్ సేతుపతి.. ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్. మరోవైపు తమిళ్ లో హీరోగానూ నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతనో గొప్ప నటుడు అనే ముద్ర అందర్లోనూ బలంగా పడిపోయింది. తరచి చూస్తే నిజంగా గ్రేట్ యాక్టర్ అని చెప్పే సినిమాలు అత్యంత తక్కువ. మిగతావన్నీ రొటీన్ చిత్రాలే. రెగ్యులర్ మాస్ మసాలా అంశాలున్న సినిమాలే. ఏమైతేనేం.. ఒక ట్యాగ్ పడిన తర్వాత ఆ ట్యాగ్ పేరు చెప్పి రెమ్యూనరేషన్స్ పెంచడం అనేది అందరికీ తెలిసిందేగా. అందుకే విజయ్ సేతుపతి తన పారితోషికాన్ని చుక్కల్లో పెట్టాడు. అది కూడా ఇతర భాషల్లో నటిస్తేనే సుమా. పైగా ఆ చిత్రాన్ని తమిళ్ లో డబ్ చేయకూడదు అనే డిమాండ్ కూడా పెడుతున్నాడు. మరి అతని ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికే కదా పెద్ద రెమ్యూనరేషన్ ఇస్తారు. అదీ కాదంటే ఎట్టా అని ఇప్పటికే చాలామంది నిర్మాతలు అతన్ని అప్రోచ్ అవడం మానేశారు. అయితే ముందే చెప్పినట్టు తమిళ్ లో హీరోగా నటిస్తున్నాడు కదా.. అలా ఓ తమిళ్ మూవీలో మనోడు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తో నటించబోతున్నాడు. సినిమా పేరు మెర్రీ క్రిస్మస్.
విజయ్ సేతుపతి – కత్రినా కైఫ్.. ఈ కాంబినేషన్ కాస్త వింతగా ఉంది కదూ. మామూలుగా అయితే బాలీవుడ్ భామలు ఇలాంటి ఆఫర్స్ ను సీరియస్ గా తీసుకోరు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. సౌత్ అంటే నార్త్ కు భయం పట్టుకుంది. ఇక్కడా నటిస్తేనే ఇమేజ్ పెరుగుతుందనే భావన వచ్చేసింది. పైగా మంచి కథ ఉంటే ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకోవచ్చు. ఆ కారణంగానే ఈ మధ్యే పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ .. కొత్త పెళ్లి కూతురు మోజు తీరకుండానే మళ్లీ మొహానికి రంగేసుకుని లైట్స్ ముందుకు వస్తోంది. ఆ క్రమంలోనే ఈ చిత్రానికి ఓకే చెప్పింది.
ఇక ఈ మూవీకి మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీరామ్ రాఘవన్ డైరెక్టర్. అతను ఇంతకు ముందు ఏక్ హసీనా థీ, జానీ గద్దర్, ఏజెంట్ వినోద్, బద్లాపూర్, అంధాదూన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా మెర్రీ క్రిస్మస్ అనే సినిమా సిద్ధం చేస్తున్నాడు. ఇది ఇద్దరు మెచ్యూర్డ్ కపుల్ మధ్య జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. మరి విజయ్ అండ్ కత్రినాల జంట ఎలా ఉంటుందో..

Related Posts