ఎవరీ దుషారా విజయన్ (Dushara Vijayan)


దుషారా విజయన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోన్న పేరు. దానికి కారణం తలైవ రజనీకాంత్ 170వ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే. ఇంతకీ ఎవరీ దుషారా విజయన్ అంటే.. ఆర్య హీరోగా నటించిన ‘సార్పట్ట పరంబరై’ చూసిన వాళ్లకు తెలుస్తోంది. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘సార్పట్ట పరంబరై’ సినిమాలో ఆర్య సరసన కథానాయికగా నటించింది దుషారా. ఆర్య భార్య పాత్రలో మరియమ్మ గా అదరగొట్టింది దుషారా.

మొదట మోడలింగ్ లోకి ప్రవేశించిన దుషారా మిస్ ఫేస్ ఆఫ్ చెన్నై గా గెలుపొందింది. ఆ తర్వాత మిస్ సౌత్ ఇండియా పోటీలలోనూ సెకండ్ రన్నరప్ గా నిలిచింది. 2019లో తమిళ చిత్రం ‘బోదై ఏరి బుద్ధి మారి’తో సినీ ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై సహజసిద్ధమైన పాత్రలలో తన టాలెంట్ ను నిరూపించుకున్న దుషారా విజయన్ లేటెస్ట్ గా రజనీకాంత్ 170 సినిమాలో నటించే ఆఫర్ అందుకుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ 170 మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ‘జైభీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ చిత్రం కూడా సామాజిక సమస్య నేపథ్యంలోనే ఉంటుందని తెలుస్తోంది. రజనీకాంత్ ఇమేజ్ కు తగ్గట్టు అత్యంత భారీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అనిరుద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని కోలీవుడ్ టాక్. అదే నిజమైతే 32 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటించే సినిమా ఇదే కానుంది.

Related Posts