విజయ్ దేవరకొండ రూరల్ యాక్షన్ డ్రామా

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి సంబంధించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత ప్రతిష్ఠాత్మక సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రమిది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో 59వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రూరల్ యాక్షన్ డ్రామాగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆద్యంతం విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో విజయ్ నటించే సినిమా ఇదే కాబోతుంది. ‘రాజావారు రాణిగారు’తో పాటు ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ వంటి సినిమాకి కథ అందించిన రవికిరణ్ కోలా.. ఈ మూవీలో విజయ్ క్యారెక్టర్ ను సరికొత్తగా డిజైన్ చేశాడట. త్వరలో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డిటెయిల్స్ ను వెల్లడించనున్నారు.

Related Posts