ముంబైలో మొదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ కొత్త షెడ్యూల్

డాషింగ్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘డబుల్ ఇస్మార్ట్’ కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్. ముంబై షెడ్యూల్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ దాదాపు పూర్తవుతోంది.

‘ఇస్మార్ట్ శంకర్’కి మించిన రీతిలో.. రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్ టైన్మెంట్ ఈ సీక్వెల్ లో ఉండబోతున్నాయట. ఈ చిత్రం కోసం ఎనర్జిటిక్ స్టార్ రామ్ మేకోవర్ సరికొత్తగా ఉండబోతుంది. బాలీవుడ్ వెటరన్ హీరో సంజయ్ దత్ మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాకి శ్యామ్ కె నాయుడు, జియాని జియానెలీ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేస్తున్నారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

Related Posts