వరుణ్ – లావణ్య పెళ్లి ముహూర్తం ఖరారు

ఏ పరిశ్రమలో అయినా ప్రేమజంటల గురించి ఒక చిన్న న్యూస్ కూడా రాకుండా ఉండదు. బట్ తెలుగులో ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.

2018 నుంచే వీరి మధ్య ప్రేమకథ మొదలైంది. అప్పటి నుంచి రీసెంట్ గా వీరి ఎంగేజ్మెంట్ కు ముందు వరకూ కూడా వీరు ప్రేమ పక్షులు అన్న చిన్న వార్త కూడా బయటకు రాలేదు అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇంక తమని తాము పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇరు కుటుంబాల వారిని ఒప్పింది ఆ మధ్య ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. ఇక వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారైంది.

నవంబర్ 1న వరుణ్ తేజ్ .. లావణ్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ పెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్ లా ఇటలీలో జరగబోతోంది.ఈ ఇద్దరూ ప్రేమలో పడింది కూడా మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నప్పుడేనట.

అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ తో పాటు లావణ్య సొంత ఊరు డెహ్రాడూన్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. మొత్తంగా టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ మ్యారేజ్ జరగబోతోంది.

Related Posts