‘మార్కో’గా వస్తోన్న మలయాళీ స్టార్

‘బాహుబలి’ పుణ్యమా అని ఇప్పుడు దక్షిణాది భాషల కథానాయకులందరూ పాన్ ఇండియా బాట పట్టారు. అంతకుముందు కేవలం ఒక భాషకే పరిమితమైన హీరోలు.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈకోవలోనే మలయాళీ స్టార్ ఉన్ని ముకుందన్ తన అప్‌కమింగ్ మూవీ ‘మార్కో’తో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశాడు.

‘జనతా గ్యారేజ్, భాగమతి, యశోద’ వంటి చిత్రాలతో ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. అలాగే.. మలయాళం చిత్రం ‘మాలికాపురం’ ఓటీటీ ద్వారా అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక.. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘మార్కో’ హై బడ్జెట్ లో ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. మరో మలయాళీ స్టార్ నివీన్ పాలీ ఇతర కీ రోల్ లో కనిపించబోతున్నాడు. ‘కె.జి.యఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండడం విశేషం. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు రానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఉన్ని ముకుందన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

Related Posts