ఆగస్టు 15న రాబోతున్న ‘ఆయ్‘

ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా రావాల్సిన ‘పుష్ప 2‘ వాయిదా పడడంతో.. ఆ తేదీకి రష్ పెరుగుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్‘ ఆగస్టు 15న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అలాగే.. సితార నుంచి రాబోయే దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్‘ కూడా ఆగస్టు 15నే వస్తుందనే ప్రచారం ఉంది.

లేటెస్ట్ గా.. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటిస్తున్న ‘ఆయ్‘ సినిమా ఆగస్టు 15కే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తొలి చిత్రం ‘మ్యాడ్‘ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేసిన నార్నే నితిన్.. ఇప్పుడు తన రెండో చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజి కంచిపల్లి దర్శకుడు. ‘ఆయ్’ టైటిల్ కి.. ‘మేం ఫ్రెండ్సండి’ అనేది ట్యాగ్ లైన్. ఆద్యంతం గోదావరి జిల్లాల నేపథ్యంలో రాబోతున్న ‘ఆయ్‘ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది.

Related Posts