‘బడ్డీ‘ ట్రైలర్.. టెడ్డీ కోసం రంగంలోకి అల్లు శిరీష్

‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. అల్లు శిరీష్ కి జోడీగా గాయత్రి భరద్వాజ్ నటించింది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని శామ్ ఆంటోని తెరకెక్కించాడు. ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, ‘ఆ పిల్ల కనులే‘ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ తో పాటు.. ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

అన్యాయంపై తిరుగబడే టెడ్డీ కథ అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉంది. ఈ మూవీలో పైలట్ ఆదిత్యరామ్ పాత్రలో అల్లు శిరీష్ కనిపించబోతున్నాడు. కో పైలట్ గా ఆలీ సందడి చేస్తున్న ఈ మూవీలో అజ్మల్ అమీర్ విలన్ రోల్ లో మురిపించబోతున్నాడు. ట్రైలర్ ఆద్యంతం స్టైలిష్ యాక్షన్ మూవీ ఫీల్ కలిగిస్తుంది. జూలై 26న ‘బడ్డీ‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts