ప్రభాస్ కిట్టీలో రెండు క్రేజీ సీక్వెల్స్

ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ఒరవడి ఈమధ్య బాగా జోరందుకుంది. ముఖ్యంగా.. పాన్ ఇండియా సినిమాలకు ఇది వరంగా మారింది. ఇలాంటి ఫ్రాంఛైజెస్ లో ఒక సినిమా హిట్టైందంటే.. మిగతా వాటికి బోనస్ గా పబ్లిసిటీ వచ్చేసినట్టే. సేమ్ కాస్టింగ్ తో.. సేమ్ టెంప్లేట్ లో వచ్చే సీక్వెల్స్ కోసం ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడు అలాంటి రెండు క్రేజీ సీక్వెల్స్ ప్రభాస్ కిట్టీలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘సలార్ 2‘.

గతేడాది డిసెంబర్ లో వచ్చిన ‘సలార్‘ చిత్రం రెబెల్ స్టార్ ప్రభాస్ ను మళ్లీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. లాంగ్ గ్యాప్ తర్వాత ‘సలార్’తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టాడు ప్రభాస్. ‘సలార్ 1’ హిట్ అవ్వడంతో.. ‘సలార్ 2’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. త్వరలోనే.. ‘సలార్ 2‘ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట ప్రశాంత్ నీల్.

‘సలార్ 2‘తో పాటు.. ఇప్పుడు ‘కల్కి 2‘ రూపంలో మరో క్రేజీ సీక్వెల్ ప్రభాస్ కి బోనస్ గా లభించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కల్కి‘ చిత్రానికి అంతటా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ‘కల్కి‘ సినిమాలో స్క్రీన్ స్పేస్ కాస్త తక్కువే అయినా.. ‘కల్కి 2‘ మొత్తం ప్రభాస్ మీదే ఉండబోతుంది. త్వరలోనే.. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్.

Related Posts