‘కల్కి’ వెయ్యి కోట్లు కొట్టడం పక్కా..!

కేవలం రెండు రోజుల్లోనే ‘కల్కి’.. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లను సాధించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా వెయ్యి కోట్లు అందుకోవడం అనేది పక్కాగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఈ మూవీలో అర్జునుడు పాత్రలో అలరించిన విజయ్ దేవరకొండ తెలిపాడు. ‘ఇప్పుడే సినిమా చూశాను.. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి సంతోషిస్తున్నాను.. ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది’ అని సోషల్ మీడియా వేదికగా జోస్యం చెప్పాడు రౌడీ స్టార్.

నిర్మాత అశ్వనీదత్ అయితే ‘కల్కి’ చిత్రం వసూళ్లను బట్టి ఈ మూవీ రూ.1500 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా.. హిందీ బెల్ట్ లో కూడా ‘కల్కి’ బాగా ఊపందుకుంటోంది. హిందీలో మొదట కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో ఈ జోరు మరింత పెరగొచ్చు.

Related Posts