ఫస్ట్ డే కలెక్షన్స్ లో ‘కల్కి‘ అరుదైన రికార్డు

ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ స్టార్ అంటే ప్రభాస్ పేరే ముందుగా చెప్పాలి. పారితోషికం పరంగా ఎప్పుడో వంద కోట్లు దాటేసిన ప్రభాస్.. గడిచిన సంవత్సరం కాలంలో ఏకంగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. గత ఏడాది జూన్ లో ‘ఆదిపురుష్‘ ఆడియన్స్ ముందుకొచ్చింది.

కంటెంట్ కనెక్ట్ కాకపోయినా.. మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్‘ తొలి రోజే రూ.140 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన ‘సలార్‘ ఫస్ట్ డే రూ.178 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక.. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ‘కల్కి‘ మొదటి రోజే రూ.200 కోట్లు కొల్లగొడుతుందనే ప్రచారం జరుగుతుంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ‘కల్కి‘కి అంతటా ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రి టికెట్ సేల్స్ లో రూపంలో భారీగా దక్కించుకుంది. ఈకోవలోనే.. ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ‘కల్కి‘ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Related Posts