ఆ ఇద్దరి వెంటే పడుతున్న టాలీవుడ్

సక్సెస్ వెనక పరుగులు తీయడం తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉంది. టాలెంట్ కంటే సక్సెస్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు మనవాళ్లు. ఒక పాత్రకు ఫలానా హీరోయిన్ మాత్రమే సూట్ అవుతుందీ అనుకున్న సందర్భాల్లో కూడా ఆ హీరోయిన్ కు సక్సెస్ లేకపోతే.. టాలెంట్ లేకున్నా.. హిట్స్ ఉన్న బ్యూటీస్ వెంట పడుతుంటారు. అలా ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల వెనక పరుగులు పెడుతుంది టాలీవుడ్. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఛాలాకీ సోయగం శ్రీ లీల. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన హీరోయిన్లు ఈ ఇద్దరూ.

పెళ్లి సందడి చిత్రంతో తెలుగు తెరను తాకింది శ్రీలీల ఈ మూవీకి బెస్ట్ రివ్యూస్ రాకపోయినా అమ్మడికి వచ్చాయి. తన ఛలాకీతనానికి టాలీవుడ్ ఫిదా అయింది. ఇక సీతారామంలో ప్రిన్సెస్ నూర్జహాన్ గా తెలుగువాళ్ల మనసులు దోచుకుంది మృణాల్. ఈ ఇద్దరి ఎంట్రీ నిన్నటి వరకూ టాప్ హీరోయిన్స్ అనిపించుకున్న పూజాహెగ్డే, రష్మిక మందన్నా వంటి వాళ్లు సర్దేసుకుంటున్నారు అంటే వీరి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పెళ్లి సందడి తర్వాత శ్రీ లీల ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ అదరగొట్టింది. మంచి అందం, డ్యాన్స్ లో గ్రేస్.. మరో మూడు నాలుగు సినిమాలు పడితే యాక్టింగ్ కూడా మెరుగవుతుది అనిపించేలా ఉన్న ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా అరడజనుకు పైగా తెలుగు సినిమాలున్నాయి.

వీటిలో పవన్ కళ్యాణ్‌ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్‌ బాబుతో గుంటూరు కారం వంటిటాప్ హీరోల సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలు చాలు.. తన క్రేజ్ టాలీవుడ్ లో ఎంతలా పెరిగిందో చెప్పడానికి. టాప్ స్టార్స్ మాత్రమే కాదు.. స్మాల్ స్టార్స్ తోనూ రొమాన్స్ కు సై అంటూ దూసుకుపోతోందీ కన్నడ కస్తూరి.


బాలీవుడ్ లో కాస్త ఇమేజ్ తెచ్చుకుని టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ కు సీతారామం ఇచ్చిన బూస్టప్ మామూలుగా లేదు. ఫస్ట్ మూవీలో పద్ధతిగా కనిపించినా సోషల్ మీడియాను హీటెక్కించడంలో మృణాల్ తర్వాతే ఎవరైనా అనుకుంటాం.

అంటే తను గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడదు అనుకోవచ్చు. అయితే అమ్మడు ఈ హాట్ నెస్ ను చూపిస్తూ.. టాప్ రెమ్యూనరేషన్ కోట్ చేస్తోంది. తన క్రేజ్ వల్ల ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా 3 నుంచి 3.5 కోట్లు అందుకుంటోంది. బట్ శ్రీ లీల కేవలం కోటి కోటిన్నరతోనే కమిట్ అవుతుంది. ప్రస్తుతం మృణాల్ నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటిస్తోంది.

నెక్ట్స్ మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో ఉన్నాయి. తన రెమ్యూనరేషన్ వల్ల కొందరు నిర్మాతలు వెనకాడుతున్నారు కానీ.. శ్రీ లీలలాగా కాస్త చూసీ చూడనట్టుగా ఓకే అంటే తనకూ అరడజను సినిమాలు ఉండేవి ఇప్పుడు. మొత్తంగా ఈ ఇద్దరు భామల వెనకే పరుగులు పెడుతోంది టాలీవుడ్.

Related Posts