బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతోంది వీళ్లే

తెలుగులో వస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే 7వ సీజన్ కు రెడీ అవుతోంది. ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు. అయితే గత రెండు సీజన్స్ చాలా డల్ గా సాగాయి. ముఖ్యంగా లాస్ట్ సీజన్ కు మినిమం రేటింగ్స్ కూడా రాలేదు. అందుకే ఈసారి మరింత స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ సారి బిగ్ బాస్ లో అనేక ట్విస్ట్ లు ఉంటాయట. సడెన్ ఎలిమినేషన్స్ ఉంటాయంటున్నారు.

అలాగే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఈ సారి అస్సలే ఉండవట. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతోన్న కంటెస్టెంట్స్ గురించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరికొన్ని పేర్లు వచ్చాయి. మరి వీళ్లు వెళుతున్నారా లేదా అనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది. కానీ ఈ కంటెస్టెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఈ సారి షోను ఇంకాస్త ఎక్కువగా రక్తి కట్టిస్తారు అనిపించుకుంటున్నారు.


ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7కి హౌస్ లోకి వెళ్లబోతున్న వారిలో ఈటీవి ప్రభాకర్, యాంకర్ నిఖిల్, జబర్దస్త్ ఫేమ్ వర్ష, సింగర్ మోహన భోగరాజు, ఢీ షో ఫేమ్ కొరియోగ్రాఫర్ పండు, టిక్ టాక్ స్టార్స్ దుర్గారావు అతని భార్య, నటి విష్ణు ప్రియ, హీరో సాయి రోనక్ తో పాటు కార్తీక దీపంలో మౌనిక పాత్రలో నటించిన శోభా శెట్టి ఇప్పటి వరకూ ఫైనల్ అయిన వారు అంటున్నారు.

కాకపోతే మరో 11మంది లిస్ట్ రావాల్సి ఉంది. ఈ సారి హౌస్ లోకి 21మందిని పంపించబోతున్నారు. వీళ్లు పదిమంది ఉన్నారు. సో మరో 11మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది. ఆ 11మందిలో ఇద్దరు ముగ్గురు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులుంటారని టాక్. మరోవైపు గంగవ్వకు మరో అవకాశం ఇవ్వబోతున్నారని కూడా అంటున్నారు.

( Photos : Instagram )


మొత్తంగా ఈ సారి సడెన్ ఎలిమినేషన్స్ ఉండబోతుండటం వల్లే ఎక్కువమందిని హౌస్ లోకి పంపించబోతున్నారట. ఏదేమైనా ఈ సారి ఖచ్చితంగా స్ట్రాంగ్ రేటింగ్స్ తెచ్చుకునేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోబోతున్నారు నిర్వాహకులు. వారి ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి. అన్నట్టు సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రారంభం కాబోతోంది.

Related Posts