ఫ్యాన్స్ కు సాయితేజ్ విన్నపం

బ్రో ద అవతార్.. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సాయితేజ్ మెగా ఫ్యాన్స్ కు ఒక విజ్ఞప్తి చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ, ఆదారాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పాడు.

అయితే సినిమా ప్రమోషన్స్ చేస్తూ అభిమానులు మంచి మంచి డిజైన్స్ చేయిస్తూ… అన్ని చోట్లా బ్యానర్స్, కటౌట్స్ కట్టేస్తున్నారు. ఈ బ్యానర్స్ కడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు సాయితేజ్. కటౌట్ కడుతూనో లేక ఇంకేదో చేస్తూనో అభిమానులకు ఏదైనా అయితే తను అస్సలు తట్టుకోలేను. అసలు ఆ మాటే వినలేను. అందుకే ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కటౌట్స్ కట్టాలని సూచించాడు.


ఇక ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఎటువంటి పోటీ లేకపోవడం మరో ప్లస్ పాయింట్ అయింది. మొదటి రోజు పవన్ కళ్యాణ్‌ సినిమా ఎంత భారీ వసూళ్లు సాధిస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అఫ్ కోర్స్ పోటీ ఉన్నా పవన్ సినిమాకు బాక్సాఫీస్ షేక్ అవుతుంది. కంటెంట్ బావుంది అనే టాక్ వస్తే చాలు.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అవుతుంది. ఇలాంటి సందర్భం పవన్ కు వచ్చింది. ఈ సినిమాలో ఆయన దేవుడు పాత్రలో కనిపిస్తున్నాడు. సాయితేజ్ ఓ ఎంప్లాయీగా కనిపించబోతున్నాడు.


సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషన్ కు గురిచేస్తుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌ తో పాటు క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడతారు అంటున్నారు. పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో ఈ రేంజ్ ఎమోషన్స్ కనిపించవు.

కానీ ఈ ఎమోషన్స్ కు పవన్ కారణమైతే అది సాయితేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందట. ఈ పాత్రలో ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుంటారు అని బలంగా చెబుతున్నారు. మొత్తంగా ఒకవైపు వర్షాలు భారీగా వస్తుండటం కొంత సమస్యగా ఉన్నా.. వానతో పోటీ పడి మరీ పవన్ కళ్యాణ్‌ సినిమా కోసం ఫ్యాన్స్ వస్తారు అనే అనుకుంటున్నారు.

Related Posts