భోళా శంకర్.. ట్రైలర్ భళా

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ట్రైలర్ విడుదలైంది. మెగాస్టార్ ను ఎలా చూపిస్తే.. ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కు నచ్చుతుందో ఆ కంటెంట్ తోనే వస్తున్నట్టు కనిపిస్తోందీ ట్రైలర్ చూస్తుంటే. ఈ విషయంలో దర్శకుడు మెహర్ రమేష్‌ మెగాస్టార్ ఇమేజ్ నే బలంగా నమ్మినట్టున్నట్టున్నాడు.

తమిళ్ మూవీ వేదాళంకు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చాలా చాలా మార్పులే చేసినట్టు కనిపిస్తోంది. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కు ఈ సినిమా కంటెంట్ కు పెద్ద వ్యత్యాసం ఉన్నట్టుంది. మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్.. ఇవన్నీ మిక్స్ చేసి మరీ వస్తున్నాడు మెహర్ రమేష్‌. ట్రైలర్ చూస్తే మెహర్ రమేష్‌ టేకింగ్ తో మరోసారి ఆకట్టుకోబోతున్నట్టు అర్థం అవుతుంది.


“వరుసగా అమ్మాయిలంతా మిస్ అవుతుంటారు. ఆ కేస్ ను ఛేదించేందుకు పోలీస్ లకు ఎలాంటి క్లూ ఉండదు. ఛేదించాలంటే భోళా కావాల్సిందే. ఇక ఓ పెద్ద మాఫియా డాన్ తనను టచ్ చేయాలంటే నన్ను మించిన గ్యాంగ్ స్టర్, మాన్ స్టర్, డెస్ట్రాయర్ రావాలి అనే విలన్ డైలాగ్ చూస్తే హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో తెలుస్తుంది.తన చెల్లికి ఎదురైన ఓ పెద్ద కష్టం నుంచి ఆమెకు తెలియకుండానే కాపాడే అన్న పాత్ర అసలు సినిమా వేదాళం. బట్ ఈ ట్రైలర్ చూస్తే అసలు వేదాళం అనే సినిమానే గుర్తుకు రాదు అనేలా ఉంది. ఆ రేంజ్ లో మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ మెగా ఇమేజ్ కు తగ్గట్టుగానే ఉండటంతో మరోసారి వాల్తేర్ వీరయ్యలా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడనిపిస్తోంది.


ఇక ట్రైలర్ లోని పబ్లిక్ గిట్ల ప్రాబ్లమ్ వస్తే.. పోలీస్ లకాడికిపోతరు.. పోలీస్ లకు ప్రాబ్లమ్ వస్తే భోళాకాడికిపోతరు.. , నీ ఎనక మాఫియా ఉంటే నా ఎనక దునియా ఉంది బే, రంగస్థలంలో రామ్ చరణ్‌ బాబులా యాక్ట్ చేస్తున్నాడ్రా.. మిమ్మల్నందరినీ ఎంటర్టైన్ చేద్దావనీ.. అనే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇంక సినిమాలో చాలానే ఉంటాయని అర్థం అవుతోంది.అయితే మురళీ శర్మతో యాప్లీస్ కాయ తింటున్నా అనే సీన్, శ్రీ ముఖితో భోళాజీ అంటే భోలో జీ అనడం, వెన్నెల కిశోర్ తో వచ్చే సీన్స్ మెగాస్టార్ కు మాత్రమే సాధ్యమయ్యే టైమింగ్ లో కనిపిస్తున్నాయి.ఈ మొత్తం ట్రైలర్ లో ఎక్కువగా ఆకట్టుకుంటోంది మెహర్ రమేష్‌ టేకింగ్. ఈ టేకింగ్ తో పాటు కంటెంట్ కూడా స్ట్రాంగ్ అనిపించుకుంటే భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద కూడా భళా అనిపించుకుంటాడు.

Related Posts