వేణు అడిగేదాంట్లో తప్పేముందీ..

వేణు యెల్దండి.. ఓ చిన్న కమెడియన్ గా తెలుగు సినిమా పరిశ్రమలో కెరీర్ మొదలుపెట్టాడు. అంతకు ముందు బాయ్ గా కూడా చేసినా.. అతను తెలిసింది నటుడుగానే .

కమెడియన్ గా పెద్ద స్టార్డమ్ రాలేదు కానీ.. అడపాదడపా సినిమాలతో తన ఉనికిని నిలుపుకున్నాడు. తర్వాత జబర్దస్త్ తో మరింత ఫేమ్ అయ్యాడు. బుల్లెతెర అంటే ఇంటిల్లిపాదికీ తెలుస్తాడు కదా.. కానీ అదే షో ద్వారా ఓ కాంట్రవర్శీ కూడా మూటకట్టుకున్నాడు. ఫైనల్ గా ఎవరూ ఊహించని షాక్ ఇచ్చాడు. దర్శకుడుగా మారాడు. బలగం అనే సినిమాతో తెలుగు సినిమా ఎప్పుడో మర్చిపోయిన ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఓ పెద్ద హిట్ గా నిలిచిందీ సినిమా. తెలంగాణ నేపథ్యంలో కొరవడుతున్న కుటుంబ సభ్యుల అనుబంధాలను కథా వస్తువుగా తీసుకుని అందరినీ కదిలించే సినిమా తీశాడు.

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంతో వేణు ఒక్కసారిగా మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం అతను రెండో సినిమాకు కథ సిద్ధం చేసుకున్నాడు. ఇది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుంది. అయితే ఈ సారి ఓ పెద్ద హీరోలో కావాలని వేణు నిర్మాతను అడుగుతున్నాడట. దీంతో అందరూ వేణుపై సెటైర్స్ వేస్తున్నారు. ఒక్క సినిమాకేనా అంటూ హేళన చేస్తున్నారు. కానీ వేణు అడిగేదాంట్లో తప్పేముందీ..


మొదటి సినిమాతో విజయం సాధించిన తర్వాత ఎవరైనా తన కథకు సంబంధించిన స్పాన్ పెంచుకుంటారు. అందుకు తగ్గ హీరోను, లేదా ఆర్టిస్టులను కోరుకుంటే తప్పేంటీ..? అసలు ఏ ఇమేజ్ లేకుండా ఫస్ట్ మూవీకే స్టార్ హీరో కావాలని అడిగే దర్శకులు లేరా..? అలాంటప్పుడు ఆల్రెడీ తనేంటో ప్రూవ్ చేసుకున్న వేణు ఈ సారి మరో పెద్ద హీరోను అడిగితే వీళ్లకు సమస్యేంటో కానీ అతనిపై వేసే సెటైర్స్ కు మాత్రం అర్థం లేదు. ఎందుకంటే నిజంగా అతని కథ బావుండి.. ఆ కథ ఓ స్టార్ నే డిమాండ్ చేస్తే అర్థం చేసుకునే తెలివి.. అరేంజ్ చేసే సత్తా నిర్మాత దిల్ రాజుకు ఉంది. ఆయనకు లేని నొప్పి వీరికి ఎందుకో గానీ.. కొంతమంది కావాలనే వేణుపై కుళ్లు కథలు అల్లుతున్నారు అనేది నిజం.

Related Posts