3 నిమిషాల 47 సెకండ్ల నిడివితో ‘సలార్‘ ట్రైలర్

‘సలార్‘ ట్రైలర్ భీభత్సానికి సమయం ఆసన్నమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఊర మాస్ యాక్షన్ అవతార్ లో అలరించబోతున్న ‘సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్‘ ట్రైలర్ 3 నిమిషాల 47 సెకండ్ల నిడివితో రాబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘సలార్‘ ట్రైలర్ ఈరోజు రాత్రి 7.19 నిమిషాలకు ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఆమధ్య విడుదలైన ‘సలార్‘ టీజర్ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదలైన గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొట్టి.. మూవీ టీజర్స్ లోనే ఓ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ప్రభాస్ నెవర్ బిఫోర్ మేకోవర్ తో మెస్మరైజ్ చేయబోతున్న ‘సలార్ పార్ట్ 1‘ ట్రైలర్ కూడా వ్యూస్ పరంగా ఓ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతుందనే ఊహాగానాలు జోరుగానే వినిపిస్తున్నాయి. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ విలన్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. డిసెంబర్ 22న ‘సలార్ 1‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts