‘ది షార్ట్ కట్‘ టీజర్.. విజయానికి అడ్డదారులుండవు

డి.ఎల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ది షార్ట్ కట్‘. ఈ సినిమాలో సందీప్ సరసన షగ్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈటీవీ ప్రభాకర్, రాకేష్ మాస్టర్, కాదంబరి కిరణ్, మురళీ ఈ సినిమాలో కనిపించే ఇతర ముఖ్య తారాగణం. కంచి రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా ‘ది షార్ట్ కట్‘ మూవీ టీజర్ లాంఛ్ ‘బిగ్ బాస్ -7‘ టీమ్ ఆధ్వర్యం లో జరిగింది.

విశ్వనగరంగా విరాజిల్లుతున్న మన హైదరాబాద్ నగరం ఓ డ్రగ్ సిటీలా తయారవుతోంది.. అంటూ ఓ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రూ. 20 కోట్ల వేల్యూ గల డ్రగ్స్ ను పట్టుకోవటానికి కస్టమ్స్ ఆఫీసర్స్ ప్రయత్నిస్తుండగా.. ఆ డ్రగ్స్ తో వచ్చిన వ్యక్తి మాల్ తీసుకుని గాయాబ్ అవుతాడు. ఆ న్యూస్ టి.వి.ల్లో రాగా.. ఆ డ్రగ్స్ కోసం హైదరాబాద్ లోని ముఠాలన్నీ ముందుకు దూకుతాయి. ఈలోపులో హీరో సందీప్ కూడా ఆ డ్రగ్స్ ను పట్టుకుని సగానికి అమ్మినా పది కోట్లు వస్తాయనే ఆలోచనతో అతనూ ప్రయత్నం చేస్తాడు. చివరకు ఆ డ్రగ్స్ ఎవరికి దొరికాయి? అనేదే ఈ సినిమా కథాంశంగా టీజర్ ను బట్టి తెలుస్తోంది.

అయితే.. ‘ది షార్ట్ కట్‘ అనే టైటిల్ ని పెట్టినా.. ‘విజయానికి అడ్డదారులుండవు‘ అంటూ ట్యాగ్ లైన్ తోనే ఈ మూవీ స్టోరీని చెప్పకనే చెప్పేశారు డైరెక్టర్ కంచి రామకృష్ణ. అడ్డదారుల్లో సంపాదించడానికి ఎగబడకూడదూ అనే సందేశాన్నిచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు.. రాకేష్ మాస్టర్ వంటి నటులతో ఈ సినిమాలో ఆద్యంతం నవ్వులు పంచే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

Related Posts