అమెరికాలో ‘కల్కి’ హవా మామూలుగా లేదు

ఈనెలలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడానికి వచ్చేస్తుంది రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ‘కల్కి’ రాబోతుంది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని వంటి పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు.

జూన్ 27న విడుదలకు ముస్తాబైన ‘కల్కి’ సినిమాకి సంబంధించి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే మొదలయ్యాయి. తొలిరోజే ఈ సినిమాకి అక్కడి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బుకింగ్స్ ప్రారంభం కాగానే 500కే డాలర్స్ ను కొల్లగొట్టిందట ‘కల్కి’. ఇక.. ఇప్పటివరకూ నార్త్ అమెరికాలో ‘కల్కి’ చిత్రానికి ప్రీ టిక్కెట్ సేల్స్ ద్వారా 1.5 మిలియన్ డాలర్స్ దక్కాయి. ఇదొక రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇంకా.. సినిమా విడుదల వరకూ మరొక మిలియన్ డాలర్స్ అయినా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అక్కడ ‘కల్కి’ దక్కించుకుంటుందనే ప్రచారం ఉంది.

మొత్తంమీద.. ఈ ట్రెండ్స్ చూస్తుంటే.. ‘కల్కి’ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే సంకేతాలందుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగానూ ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వనున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజయ్యింది. త్వరలోనే.. పలు సిటీలలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్.

Related Posts