‘డెవిల్’ మూవీ నుంచి ‘దిస్ ఈజ్ లేడీ రోజీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..

‘బాబు బాగా బిజీ’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్‌ మేడారం. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌, సంయుక్త మీనన్ జంటగా ‘డెవిల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. “దిబ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్” అనేది ఉప శీర్షిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా ‘దిస్ ఈజ్ లేడీ రోజీ’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.

యూట్యూబ్ లో ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ కి శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజ కుమారి పాడారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. ఈ సాంగ్ వింటుంటే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేసే సాంగ్స్ మాదిరిగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్ నామా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Related Posts