‘భగవంత్ కేసరి‘ సెన్సార్ రిపోర్ట్ అదిరింది

బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఇక ఈ సినిమాలో నెవర్ బిఫోర్ బాలయ్య ను చూస్తారనేది సెన్సార్ సభ్యుల నుంచి వినిపిస్తోన్న మాట.

‘భగవంత్ కేసరి‘ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో తమన్ ఇచ్చిన ఆర్.ఆర్. హైలైట్ గా నిలవనుందట. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పటివరకూ తమన్ పై ఏమైనా ట్రోలింగ్ ఉంటే అవన్నీ పక్కకు పోతాయంటున్నారు.

బాలయ్య సినిమాల్లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన ‘భగవంత్ కేసరి‘ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, బాలయ్య మార్క్ యాక్షన్.. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అన్నీ కలిసి ‘భగవంత్ కేసరి‘ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోందనే ఆశాభావంతో ఉన్నారు అభిమానులు. దసరా కానుకగా అక్టోబర్ 19 నుంచి బాక్సాఫీస్ బరిలో ‘భగవంత్ కేసరి‘ సందడి మొదలవ్వబోతుంది.

Related Posts