నాగచైతన్య కు ‘తండేల్‘ ఎంతో ప్రత్యేకం

అక్కినేని బ్రాండ్ ను మును ముందుకు తీసుకెళుతూ.. స్టెడీ హిట్స్ తో దూసుకెళ్తున్న హీరో యువ సామ్రాట్ నాగచైతన్య. చైతూ ఇండస్ట్రీకి వచ్చి.. ఈ సెప్టెంబర్ కి 15 ఏళ్లవుతుంది. ఈ ఒకటిన్నర దశాబ్ద కాలంలో ఎన్నో విజయాలందుకున్నాడు. అయితే.. స్టార్ రేసులో మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. ఇప్పుడు ‘తండేల్‘ మూవీతో తనకు ఆ అవకాశం వస్తుందని భావిస్తున్నాడు నాగచైతన్య.

నాగచైతన్య నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్‘. ‘కార్తికేయ 2‘తో ఇప్పటికే పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే గీతా ఆర్ట్స్ లో ఇప్పటికే ‘100 పర్సెంట్ లవ్‘ వంటి హిట్ అందుకున్నాడు చైతన్య. అలాగే.. చందూ మొండేటి తో ‘ప్రేమమ్‘, సాయిపల్లవితో ‘లవ్ స్టోరీ‘ వంటి విజయాలు కూడా ఉన్నాయి. అలా.. మంచి హిట్ కాంబోస్ లో రాబోతున్న క్రేజీ మూవీ ‘తండేల్‘.

వాస్తవ సంఘటనల ఆధారంగా ఆద్యంతం మత్సకారుల ఇతివృత్తంతో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకోసం చైతన్య సముద్రంలో వేటాడటం నేర్చుకున్నాడు. శ్రీకాకుళం మాండలికాన్ని ఔపోసాన పట్టేశాడు. ఈ సినిమాలోని తాను పోషిస్తున్న పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని చైతన్య ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లేటెస్ట్ గా ‘తండేల్‘ నుంచి ఓ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగచైతన్య. డిసెంబర్ 20న ‘తండేల్‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts