మహేష్ బాబు లాంఛ్ చేసిన ‘లవ్ మీ‘ సాంగ్

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో ‘లవ్ మీ‘ ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ భీమవరపు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఘోస్ట్ లవ్ స్టోరీ మే 25న విడుదలకు ముస్తాబవుతోంది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఏం అవుతుందో‘ అంటూ సాగే ఇంటెన్స్ సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ‘లవ్ మీ‘ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూనే.. ఈ పాటను కంపోజ్ చేసిన ఆస్కార్ విజేత కీరవాణికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందజేశాడు మహేష్. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని నితీష్ కొండిపర్తి, గోమతి అయ్యర్ ఆలపించారు.

Related Posts