‘పుష్ప 2‘ నుంచి సెకండ్ సింగిల్ వస్తోంది

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ‘పుష్ప 2‘ ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అలాగే.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప‘ కూడా చార్ట్ బస్టర్ అయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన రాకింగ్ ట్యూన్ తో ‘పుష్ప పుష్ప‘ సాంగ్ కి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఇప్పుడు ‘పుష్ప 2‘ నుంచి ఓ రొమాంటిక్ మెలోడీని సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు. హీరోహీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక మధ్య చిత్రీకరించిన ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ వీడియో రేపు (మే 23) రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పుష్ప 2‘ ఆగస్టు 15న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts