కుక్కతో పెళ్లి, విడాకులు కూడానా..?

కొత్త కాన్సెప్ట్స్ అంటే ఆడియన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కాన్సప్ట్స్ ను ఆకట్టుకునేలా చెబితే ఖచ్చితంగా ఆదరిస్తారు. అలా టైటిల్ తోనే ఆకట్టుకున్న సినిమా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.

సంజయ్ రావు, ప్రణవి జంటగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏఆర్ సుధీర్ డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ స్లమ్ డాగ్ హజ్బెండ్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తే వీళ్లు ఓ డిఫరెంట్ పాయింట్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది.


జాతక దోషం వల్ల పెళ్లి కాని ఓ కుర్రాడికి.. ముందుగా కుక్కతో పెళ్లి చేస్తే తర్వాత అతనికి అమ్మాయితో పెళ్లవుతుందని చెబుతాడు ఓ పంతులు. దీంతో అది నిజమని నమ్మి.. ఓ కుక్కకు మూడు ముళ్లు వేస్తాడు.

దీనికి ముందు కుక్కతో పెళ్లి చూపులు కూడా ఉంటాయి. కుక్క తర్వాత తను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ తీరా తాళి కట్టే సమయానికి కొన్ని తెలుగు సినిమాల్లో ఆపండి పెళ్లి అనే డైలాగ్ వినిపిస్తుంది.

కట్ చేస్తే మొదట తాళి కట్టిన కుక్క బ్రతికి ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదు అంటూ వ్యవహారం కోర్ట్ వరకూ వెళుతుంది. అంతే కాదు.. కుక్కకు విడాకులు ఇస్తే 20 లక్షలు భరణం కూడా డిమాండ్ చేస్తారు. మరి ఇలా పెళ్లికి తొందర పడి కుక్కకు తాళి కట్టిన ఆ స్లమ్ డాగ్‌ హజ్బెండ్ బ్రతుకు చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి.


చిన్న సినిమాలా కనిపిస్తున్నా.. సునిల్, అలీ, సప్తగిరి, బ్రహ్మాజీ అంటూ పెద్ద తారాగణమే కనిపిస్తుంది. అన్నట్టు ఈ సంజయ్ రావు అనే కుర్రాడు బ్రహ్మాజీ కొడుకే. ఏదేమైనా జాతక దోషాలను అడ్డు పెట్టి మనుషులకు జంతువులతో పెళ్లి జరిపించే కొందరు కుహనా జాతకరాయుళ్లపై ఇది పెద్ద సెటైర్ లానే ఉంది.

Related Posts