ఆకట్టుకుంటోన్న ‘శశి మధనం’ టీజర్

సోనియా సింగ్, సిద్ధు పవన్.. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో కలిసి సందడి చేసిన జంట. ఇప్పుడు ఈ జోడీ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ ‘శశి మధనం’. ’90s మిడిల్ క్లాస్ బయోపిక్’తో సూపర్ హిట్ అందుకున్న ఓటీటీ సంస్థ ఈటీవి విన్ లో ఈ సిరీస్ ప్రసారం కాబోతుంది.

వినోద్ గాలి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. ‘చదువు రాని సరస్వతి శశి మరియు లక్ష్మి కటాక్షం లేని మదన్ ల యొక్క దాగుడుమూతలు చూద్దాము రారండి’ అంటూ విడుదల చేసిన ఈ టీజర్ ఆద్యంతం సరికొత్తగా ఆకట్టుకుంటుంది.

https://www.youtube.com/watch?v=SmtXFZs3a8k

Related Posts