మరోసారి థియేటర్లలోకి మెగా మూవీ

నాటి కల్ట్ క్లాసిక్స్ ను మళ్లీ రీ రిలీజ్ చేసే సంప్రదాయం ఈమధ్య బాగా జోరందుకుంది. ఈకోవలోనే మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

నటించిన చిత్రాల్లో ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ ది ప్రత్యేక స్థానం. ‘ఇంద్ర, ఠాకూర్‘ వంటి ఇండస్ట్రీ హిట్స్ తో మంచి జోష్ మీదున్న మెగాస్టార్ కి ఆ తర్వాత వచ్చిన ‘అంజి‘ బాగా నిరాశపరిచింది. ఆ సమయంలో మళ్లీ మెగాస్టార్ ని ఫుల్ ఫామ్ లో నిలిపిన మూవీగా ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ నిలిచింది. పేరుకు రీమేక్ అయినా ఫక్తు మెగాస్టార్ మాస్ మూవీగా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుందీ చిత్రం.

2004లో వచ్చిన ఈ చిత్రం అప్పటి రికార్డులను బ్రేక్ చేసింది. శంకర్ దాదాగా చిరంజీవి నటించిన తీరు, చెప్పిన ఇంగ్లీష్ సామెతలు, వేసిన స్టెప్పులు అన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. మెగా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినిమా ప్రేమికులు సైతం ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ ‘ సినిమాకు ముగ్దులయ్యారు.

జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్ తో పాటు.. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఈ మూవీకి పెద్ద అసెట్‌ గా నిలిచాయి. మొత్తంమీద.. మరోసారి అప్పటి వింటేజ్ చిరుని చూపించేందుకు, ఆ గ్రేస్, మాస్‌ ఎరాలోకి తీసుకెళ్లేందుకు శంకర్ దాదా వస్తున్నాడని సోషల్ మీడియాలో మెగాభిమానులు ట్వీట్స్, కామెంట్స్ తో సందడి చేస్తున్నారు. మెగా ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. మరి.. మరోసారి థియేటర్లలో ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్‘ దుమ్మురేపుతుందేమో చూడాలి.

Related Posts