నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి‘ రేపు గ్రాండ్ గా రిలీజవుతోంది. ఇప్పటికే మొదలైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదరహో అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ‘భగవంత్ కేసరి‘ క్రేజ్ మామూలుగా లేదు. వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న నటసింహం.. అసలు అపజయమే లేని దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న సినిమా కావడమే ‘భగవంత్ కేసరి‘ అంచనాలు ఆకాశాన్నంటడానికి కారణాలు.
ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలలో బాలకృష్ణ, శ్రీలీల మధ్య తండ్రీ కూతుళ్ల అనుబంధమే హైలైట్ అయ్యింది. అయితే.. ఈ సినిమాలో బాలయ్య మార్క్ యాక్షన్ భారీ స్థాయిలోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. జైల్ బ్యాక్ డ్రాప్ లో ఫైట్.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్స్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతున్నాయట. ఇక.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ లలో వచ్చే ఫైట్స్ అయితే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయట. మొత్తంమీద.. ఫస్టాఫ్ లో రెండు, సెకండాఫ్ లో మూడు ఫైట్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన సెన్సార్ రిపోర్ట్ అయితే అదిరింది. మరికొద్ది గంటల్లో స్టార్ట్ అయ్యే ప్రీమియర్స్ తో ‘భగవంత్ కేసరి‘కి ఎలాంటి రిపోర్ట్ వస్తుందో చూడాలి.