సప్తగిరి పొలిటికల్ ఎంట్రీ

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చాడు సప్తగిరి. అనుకోకుండా నటుడయ్యాడు. ప్రేమకథా చిత్రమ్ తో అద్భుతమైన కామెడీ పండించి తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి బిజీయొస్ట్ కమెడియన్ గా ఎదిగాడు. కట్ చేస్తే సునిల్ దారిలో వెళుతూ మధ్యలో హీరోగానూ మెప్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని సినిమాలు ఆకట్టుకున్నాయి కూడా. ప్రస్తుతం అవకాశాలను బట్టి కెరీర్ లాగిస్తున్నాడు సప్తగిరి.

హీరోగా అయినా కమెడియ్ గా అయినా ఓకే అంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన అన్ స్టాపబుల్ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. అయితే ఇప్పటి వరకూ ఎప్పుడూ బయట పడలేదు కానీ అతను సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు.


ఈ నెల 15న తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించాడు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని చెబుతున్నాడు. వచ్చే 2024 ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేస్తానంటున్నాడు. ఈ మధ్య కాలంలో లోకేష్ ను పాదయాత్రలో కలిశాడట. అక్కడి నుంచి డైరెక్ట్ గా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే సప్తగిరి తిరుపతి నుంచి ఎమ్మెల్యే టికెట్ ను కూడా ఆశిస్తున్నాడని సమాచారం.

ఇప్పుడప్పుడే టికెట్ ఇవ్వకపోయినా.. ప్రస్తుతం పార్టీలో ఏదైనా బాధ్యత ఇస్తే తీసుకోవాలనుకుంటున్నాడు.
ఇక మాజీ ఎమ్.పి, తెలుగుదేశం పార్టీ దివంగత నేత శివ ప్రసాద్ తో కలిసి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు సప్తగిరి. ఆ రెండు సినిమాల్లో శివ ప్రసాద్ తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. మొత్తంగా సప్తగిరి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నాడు. మరి అతని ప్రభావం ఏమైనా కనిపిస్తుందా అనేది చూడాలి.

Related Posts