క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. చిత్రీకరణ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

మీనాక్షి చాదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మించారు. హిట్ యూనివర్స్ పరిచయం చేయడం ‘హిట్ వెర్సె’ అని మేకర్స్ పరిచయం చేయటం అందరినీ ఎంతో సంతోషపెడుతుంది. తాజాగా ‘హిట్ వెర్సె’ అనే వీడియోతో దర్శకుడు శైలేష్ కొలను అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియోతో డైరెక్టర్ హిట్ ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేశారు. కె.డి పాత్రలో అడివి శేష్.. చాలా కూల్‌ కాప్‌గా ఎలా ఉంటాడో ఎలివేట్ చేశారు. థ్రిల్, యాక్షన్, ఫన్ వంటివి కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇందులో హిట్ 1 మరియు హిట్ 2 మధ్య రిలేషన్ ఉందని కూడా రివీల్ చేశారు. ఈ ప్రపంచంలో పెద్ద సంఖ్యలో డెవలప్ అవుతుందని తెలియజేశారు.

చివరగా కూల్ కాప్ రోల్‌లో అడివి శేష్ ఎంట్రీ ఆశ్చర్యంతో స్టన్ అయ్యారు. మూవీ టీజర్ డేట్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ టీజర్‌ను బ్యాంగ్‌తో మేకర్స్ పూర్తి చేశారు. టీజర్‌ను చూస్తుంటే మూవీ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ లెవల్లో విడుదలకానుంది.