అంగరంగ వైభవంగా ‘ఆర్.సి. 16‘ ప్రారంభం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన‘ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ‘ఆర్.సి. 16‘ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రారంభోత్సవానికి చిత్రబృందంతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, భారీ చిత్రాల దర్శకుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Related Posts