రష్మికకి యాక్టింగ్ రాదు: KRK కామెంట్స్ వైరల్

‘యానిమల్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నకి యాక్టింగ్ రాదు..అంటూ బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన స్టార్ హీరోలు నటించిన సినిమాల గురించి ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్వీట్స్ పెట్టి దుమారం లేపాడు. దాంతో అటు సెలబ్రిటీస్ కి ఇటు ఫ్యాన్స్ కి కేఆర్కే అంటే మంటపుడుతుంటుంది.

ఇప్పుడేమో ‘యానిమల్’ సినిమాపై అంతా పాజిటివ్ బజ్ ఏర్పడితే దాన్ని దెబ్బతీయాలన్నట్టుగా, ఏకంగా హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగోలేదని కామెంట్స్ చేసి మరోసారి తిట్టించుకుంటున్నాడు. ర‌ణ‌బీర్ క‌పూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెర‌కెక్కిన ‘యానిమల్’ 2023లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైనప్పటి నుంచీ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో రష్మిక మందన్నకి నటన రాదు.. అని కేఆర్కే విమర్శించడం ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. ఇంతకముందు కూడా కేఆర్కే ఇలాగే సల్మాన్ ఖాన్, ప్రభాస్, విజయ్ దేవరకొండ సహా పలువురు స్టార్స్ కి యాక్టింగ్ రాదంటూ విమర్శించి అబాసుపాలయ్యాడు.

Related Posts