రాజమౌళి – మహేష్ బాబు.. అప్డేట్ కష్టమే

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి టాలీవుడ్ లో ఉండగా కుదర్లేదు. ఇప్పుడు ఆయన ప్యాన్ వరల్డ్ డైరెక్టర్. ఇప్పుడు సెట్ అయింది.

మహేష్ కోసం ఓ సూపర్ హీరో టైప్ స్టోరీ రెడీ చేశానని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్.ఈ మూవీని అమెజాన్ అడవుల నేపథ్యంలో రూపొందించబోతున్నట్టు రాజమౌళి చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే వివిధ దేశాల నుంచి ముగ్గురు హీరోయిన్లను తీసుకోబోతున్నారనే వార్తలూ వస్తున్నాయి. ఇటు ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు రాజమౌళి. రాజమౌళి మూవీ అంటే మినిమం మూడేళ్ల టైమ్ పడుతుంది. ఆ మూడేళ్లకూ సరిపడా అంతా రెడీ చేసుకోవాలంటే జక్కన్నకు చాలా టైమ్ కావాలి. అదే ఇప్పుడు చేస్తున్నాడు.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ కీలకమైన ఘట్టం ఈ మూవీ ఓపెనింగ్. అది ఈ నెల 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ బర్డ్ డే రోజు ఓపెనింగ్ అసాధ్యం అనుకోవచ్చు.


మహేష్ ఇప్పుడు వెకేషన్ లో ఉన్నాడు. తన కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వెళ్లిన అతను తన బర్త్ డేను కూడా విదేశాల్లోనే జరుపుకుని ఈ నెల 15తర్వాత ఇండియాకు రాబోతున్నాడు. అంటే బర్త్ డే రోజు ఓపెనింగ్ కుదరదు. ఆ మేరకు అప్డేట్ కూడా ఏమీ ఉండదు అనుకోవచ్చు. నిజానికి తన సినిమాల ప్రారంభోత్సవాలకు మహేష్ హాజరు కాడు. ఆయన భార్య నమ్రత వస్తుంది. ప్రస్తుతం ఆమె కూడా అతనితో పాటే ఉంది. అంచేత ఈ బర్త్ డే సందర్భంగా మహేష్ – రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్తగా ఏ అప్డేట్ నూ అభిమానులు ఆశించకపోవడమే బెటర్.

నిజానికి వీళ్లు ఏదైనా ఎక్స్ పెక్ట్ చేస్తే గుంటూరు కారం నుంచి చేయాలి. బట్ ఈ మూవీపై ఎవరికీ అంతగా ఆసక్తి కనిపించడం లేదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఈ సినిమా కూడా ఈ నెల 20 నుంచి మహేష్ సెట్స్ లో అడుగుపెడతాడు అంటున్నారు.గుంటూరు కారం ఈ యేడాది చివరి వరకూ అయిపోతుంది. సంక్రాంతి తర్వాత నుంచి రాజమౌళితో సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఈ బర్త్ డే రోజు జక్కన్నతో సినిమాపై ఎలాంటి అప్డేట్ రాకపోవచ్చు అని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. అయినా మరీ ఇంత అర్లీగా కూడా అవసరం లేదేమో..

Related Posts