ప్రభుదేవా కంటే అనసూయే హైలెట్

ప్రభుదేవా హీరోగా రూపొందుతోన్న సినిమా వూల్ఫ్. ఇది అతనికి నటుడుగా 60వ సినిమా కావడం విశేషం. కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారి, దర్శకత్వంలోనూ హిట్స్ కొట్టి యాక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు ప్రభుదేవా.

తన కెరీర్ లో మరో మైల్ స్టోన్ లాంటి సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఎంచుకున్నట్టు కనిపిస్తున్నాడు.తాజాగా ఈ వూల్ఫ్ టీజర్ విడుదలైంది. టీజర్ లో ప్రభుదేవా కంటే అనసూయ హైలెట్ కావడం విశేషం.యస్ ఈ మూవీలో తనూ ఉంది. కంప్లీట్ గా ఓ కొత్త జానర్ లో ఈ చిత్రం రూపొందుతున్నట్టుగా ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

ఒక్క డైలాగ్ కూడా లేదు. కానీ విజువల్ గా ఇంపాక్ట్ వేస్తోందీ టీజర్.
అనసూయ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆధ్యాత్మిక కేంద్రం. కొంతమంది మగవారిని బంధించి ఉంచారు.వారి చుట్టూ భారీ రక్షణ గోడ. తప్పించుకోవాలని చూస్తే దారుణంగా హింసించడం. ఆ చోటకు ప్రభుదేవా కూడా ఒక హిప్నటైజ్ ద్వారా తీసుకురాబడతాడు. తర్వాత ఏం జరిగింది. అసలు అక్కడ జరుగుతున్నది ఏంటీ అనేది ఆసక్తిగా కనిపిస్తోంది. దీనికి “పురాతన ఆచారం ప్రారంభమవుతుంది” అనే కొటేషన్ యాడ్ చేశారు. ఆ ఆచారం ఏంటీ.. అనేదే సినిమాగా కనిపిస్తోంది.


మొత్తంగా ప్రభుదేవాతో పాటు అనసూయ, లక్ష్మీ రాయ్, వశిష్ట సింహా తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని వినూ వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. సందేష్ నాగరాజ్ నిర్మిస్తున్నాడు.

Related Posts