రాజమౌళి – మహేష్‌ బాబు .. క్రేజీ అప్డేట్స్

రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్ గురించి టాలీవుడ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. అది ఇన్నాళ్లకు సెట్ అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఇప్పుడు రాజమౌళిది ఇంటర్నేషనల్ రేంజ్.

ఇప్పటి వరకూ టాలీవుడ్ దాటని మహేష్‌ ఇమేజ్ ఒక్కసారిగాఅంతర్జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం వచ్చిందన్నమాట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ కథ గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు వింటే ఈ సినిమాపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉన్నాయి ఆయన చెప్పిన సంగతులు.


కొన్నాళ్లుగా ఈ కథ గురించి వచ్చిన వార్తల్లో అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అనేది ఎక్కువగా వినిపించింది. అయిత అమెజాన్ అడవుల నేపథ్యమా కాదా అనేది చెప్పలేదు కానీ నిజంగానే ఇది ఓ అడ్వెంచరస్ థ్రిల్లరేనట. ఇండియానా జోన్స్ రేంజ్ లో ఉంటుందని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్.

అంతే కాదు.. స్టీవెన్ స్పీల్ బర్గ్ 1981లో తీసిన రైడర్స్ ఆఫ్‌ ద లాస్ట్ ఆర్క్ అనే సినిమాతో పోల్చాడు. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా తోడవుతుంది. దీనికి తోడు రాజమౌళి మూవీస్ లో కనిపించే ఎమోషన్ కూడా యాడ్ అవుతుంది.

అందుకే దీన్ని ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు అంటున్నారు. ఈ నెలాఖరు వరకూ స్క్రిప్ట్ పూర్తవుతుందట. ఓ సారి ఫైనల్ స్క్రిప్ట్ చెక్ చేసుకుని లాక్ చేసుకున్న తర్వాత డిసెంబర్ నుంచి షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.ఇక ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారు అని సమాచారం.

Related Posts