‘సలార్‘ సినిమాకి సమర్పకుడిగా పృథ్వీరాజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ మూవీ ‘సలార్‘ విడుదలకు ఇంకా కేవలం నెలన్నర రోజులు మాత్రమే ఉంది. అయినా.. చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్ లో స్పీడు పెంచడం లేదు. భారీ హైప్ తో రాబోతున్న ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ విషయంలో ప్రమోషన్స్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. పలు భాషలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించాల్సి ఉంటుంది. ఇక.. ‘సలార్‘ ఆయా భాషల్లో విడుదలకు సంబంధించి ఆసక్తికర సమాచారాన్ని అయితే అందిస్తోంది చిత్రబృదం.

‘సలార్‘ చిత్రాన్ని కేరళలో నటుడు పృథ్వీరాజ్ విడుదల చేస్తున్నాడు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో ‘సలార్ సీజ్ ఫైర్‘ కేరళలో భారీ ఎత్తున విడుదలకాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. ఇక.. ‘సలార్‘ సినిమాలో ఈ మలయాళం సూపర్ స్టార్ ప్రధాన ప్రతినాయకుడిగానూ నటిస్తున్నాడు. అసలు ‘సలార్‘ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘కె.జి.యఫ్‘ ను కేరళలో విడుదల చేసింది కూడా పృథ్వీరాజే. ఒకవిధంగా ఆ అనుబంధంతోనే ‘సలార్‘లో నటించడానికి ఓ.కె. చెప్పాడు. మొత్తంమీద.. ఇప్పటికైనా ‘సలార్‘ ప్రచారంలో చిత్రబృందం స్పీడు పెంచుతుందేమో చూడాలి.

Related Posts