మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘లో తొలుత కథానాయికగా నుపుర్ సనన్ ను ఎంపిక చేశారు. సినిమా ముహూర్తం జరుపుకున్నాక.. నుపుర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండడంతోనే ‘కన్నప్ప‘లో నటించలేకపోతుందని అప్పట్లో విష్ణు తెలిపాడు. లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్ సెట్ సెట్ అయ్యింది. ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ ని కథానాయికగా ఎంపిక చేశారు.
ప్రీతి ముకుందన్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకునే ముందు ఆడిషన్స్ నిర్వహించారట. ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించిందట. స్వయంగా భరతనాట్య కళాకారిణి అయిన ప్రీతి.. ఈ మూవీలో తన క్లాసికల్ డ్యాన్స్ తో ఆడియన్స్ ను అలరించనుందట. ‘కన్నప్ప‘ టైటిల్ రోల్ లో విష్ణు నటిస్తుండగా.. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి నటులు నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.