పురాణ పాత్రలకు పర్ఫెక్ట్ యాక్టర్ ప్రభాస్

హిందూ పురాణాల్లోని రామాయణం, మహాభారతం ఇతిహాసాలకు మించిన రసవత్తర కథాంశాలు మరేవీ ఉండదు. అందుకే.. మన దర్శకులు, నిర్మాతలు ఈ పౌరాణిక గాథలను తెరకెక్కించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రామాయణం, మహాభారతం ఇతివృత్తంగా వందలాది సినిమాలొచ్చాయి. ఈ పౌరాణిక పాత్రలకు నటరత్న నందమూరి తారక రామారావు కుదిరినట్టు మరో నటుడు కుదరలేదు.

అయితే.. ఈ కాలంలో పౌరాణిక పాత్రలకు పర్ఫెక్ట్ గా సూటయ్య నటుడు అంటే ప్రభాస్ ను చెప్పొచ్చు. ఆజానుబాహులైన పురాణ పురుషుల ఆహార్యానికి సరిగ్గా సరిపోయే రూపం ప్రభాస్ ది. అందుకే.. ‘ఆదిపురుష్’ కోసం శ్రీరాముడుగా ఏరికోరి ప్రభాస్ ను ఎంచుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. సినిమా తేడా కొట్టడం అనేది వేరే విషయం. ఇక.. తాజాగా ‘కల్కి’ సినిమాలో కర్ణుడు పాత్ర కోసం ప్రభాస్ ను తీసుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

అసలు ఈ సినిమాలో ‘ప్రాజెక్ట్ కె’ అంటే.. ‘ప్రాజెక్ట్ కర్ణ’ అని వినిపిస్తుంది. ‘కల్కి’ ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ను కర్ణుడుగా కాసేపే చూపించాడు నాగీ. రెండో పార్ట్ లో కర్ణ పాత్రలో ప్రభాస్ అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది.

Related Posts