హీరోలను ఎలివేట్ చేయాలంటే మనోళ్లే

హిందీ చిత్ర పరిశ్రమ అంటేనే భారతీయ సినిమా మొత్తాన్ని ప్రతిబింబించే పరిశ్రమగా గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో పనిచేసే నటీనటులు, దర్శకనిర్మాతలకు దేశవ్యాప్తంగా రికగ్నిషన్ ఉంటుంది. అయితే ‘బాహుబలి’ తర్వాత ఈ సమీకరణాలన్నీ మారిపోయాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరాణి పేర్లు వినిపిస్తే.. ‘బాహుబలి’ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి స్టార్ డైరెక్టర్ గా మారాడు రాజమౌళి.

దర్శకధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే తెలుగుతో పాటు దక్షిణాది సినీ అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తారో.. అంతకు మించిన రీతిలో ఇప్పుడు యావత్ భారతదేశ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు జక్కన్న. హీరోలను ఎలివేట్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. లార్జర్ దెన్ లైఫ్ హీరోలను మనవాళ్లు ఏ విధంగా చూపిస్తారు అనడానికి రాజమౌళి సినిమాలే నిదర్శనం.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ జెండా ఎగురేసిన దర్శకుల్లో మరో ముగ్గురున్నారు. వారే.. సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ని సుకుమార్ ఏ రేంజులో చూపించాడో తెలిసిందే. పుష్ప రాజ్ గా బన్నీ మేకోవర్, స్వాగ్ ఎంతో మాసీగా ఉంటాయి. అందుకే.. ఆ క్యారెక్టర్, ఎలివేషన్స్ అంతలా క్లిక్ అయ్యాయి. బాలీవుడ్ చాక్‌లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ లోని మాస్ యాంగిల్ ను బయటకు తీసింది మన డైరెక్టరే. ‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్.. యాక్షన్ లో ఓ యానిమల్ లా రెచ్చిపోయాడు. లేటెస్ట్ గా ‘కల్కి 2898 ఎడి’లో బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ అమితాబ్ తో పాటు.. డార్లింగ్ ప్రభాస్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలివేట్ చేసి తీరు అద్భుతం అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

తెలుగు దర్శకులు మాత్రమే కాదు.. తమిళం నుంచి అట్లీ, లోకేష్ కనకరాజ్.. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ కూడా హీరోల ఎలివేషన్స్ ను ఓ రేంజులో డిజైన్ చేస్తుంటారు. అందుకే.. హీరోల ఎలివేషన్స్, హీరో వర్షిప్ బాక్సాఫీస్ వద్ద హిట్ ఫార్ములాగా ఎలా మారింది అనేదానికి సౌత్ డైరెక్టర్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఈ విషయంలో సౌత్ డైరెక్టర్స్ ను చూసి నేర్చుకునే పనిలో ఉన్నారట.

Related Posts