తొలి రోజు వసూళ్లలో ప్రభాస్ రేర్ రికార్డ్

రెబెల్ స్టార్ ప్రభాస్.. అసలు సిసలు పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు.. డార్లింగ్ ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతారు. ఆ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎగబడతారు. అందుకే.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ ఓ రేర్ రికార్డ్ కొల్లగొట్టాడు. మధ్యలో ఒక సినిమా తప్పితే.. వరుసగా ఐదు చిత్రాలతో తొలిరోజే వంద కోట్లు వసూళ్లను సాధించాడు.

తొలి రోజే వంద కోట్లు వసూళ్లు చేసిన ప్రభాస్ తొలి చిత్రం ‘బాహుబలి 2’. ఒకవిధంగా ‘బాహుబలి 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.200 కోట్లు దాటిపోయాయి. ఆ తర్వాత ‘సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి’ చిత్రాలతో తొలి రోజే వందేసి కోట్లు వసూళ్లు చేసిన అరుదైన ఫీట్ చేశాడు ప్రభాస్. ‘కల్కి’ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు కొల్లగొట్టింది.

లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ఈ సినిమా ఈ వారాంతానికి ఐదు వందల కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Related Posts