బ్లాక్ బస్టర్ డేట్ కే ఫిక్సైన పవన్ ‘ఓజీ’?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రం ‘ఓజీ’. పవన్ సినిమాల్లో చివరిగా మొదలైనా.. ఈ చిత్రాన్ని ముందుగా ఆడియన్స్ ముందు నిలిపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఓజీ’ మూవీ సాధారణ ఎన్నికల తర్వాత మళ్లీ రీ స్టార్ట్ కానుంది.

ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ అసలు సిసలు గ్యాంగ్ స్టర్ గా మూవీగా ‘ఓజీ’ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘అత్తారింటికి దారేది’ విడుదలైన సెప్టెంబర్ 27న తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది’ 2013, సెప్టెంబర్ 27న విడుదలైంది. సినిమా థియేటర్లలోకి వచ్చే ముందే ఆన్ లైన్లో లీకైనా.. ‘అత్తారింటికి దారేది’ని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చేశారు అభిమానులు. మరి.. ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ సెంటిమెంట్ తో వస్తుందనుకుంటోన్న ‘ఓజీ’ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Related Posts