మరోసారి హీరోయిన్ తో కుస్తీ పట్టిన షారుక్

బాలీవుడ్ సీనియర్ హీరోస్ లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు కింగ్ ఖాన్ షారుక్. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్, జవాన్‘లతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న షారుక్.. ఇప్పుడు ‘డంకీ‘తో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక.. ‘పఠాన్, జవాన్‘ చిత్రాల్లో ఫుల్ లెన్త్ యాక్షన్ తో అదరగొడితే.. ‘డంకీ‘లో తన మార్క్ రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో అలరించబోతున్నట్టు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. అలాగే.. ‘జవాన్, డంకీ‘ చిత్రాల్లో ఓ కామన్ పాయింట్ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ను తెగ ఎగ్జైట్ చేస్తోంది.

‘జవాన్‘ సినిమాలో దీపిక పదుకొనె తో కుస్తీ పట్టి ఆమెను ముగ్గిలోకి దింపాడు. ‘జవాన్‘లో ఈ లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ‘డంకీ‘లోనూ హీరోయిన్ తాప్సీతో షారుక్ కుస్తీ సీన్స్ బాగా రంజింపజేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ‘డంకీ‘ నుంచి రిలీజైన ‘లుట్ పుట్ గయా..’ పాటలో ఈ కుస్తీ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని విజువల్స్ చూపించారు. సినిమాలో ఆ ఎపిసోడ్ ఇంకా హైలైట్ గా ఉండబోతుందట. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ‘డంకీ‘ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదలకాబోతుంది. మొత్తంమీద.. ఈ మూవీతో బాలీవుడ్ బాద్షా మరో బడా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related Posts