‘సత్య‘ ట్రైలర్.. సహజత్వంతో కూడిన ప్రేమకథా చిత్రం

న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఇక.. సహజత్వంతో కూడిన ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో తమిళులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటారు. ఈకోవలోనే.. గతంలో తమిళం నుంచి ‘ప్రేమిస్తే‘ వంటి సినిమాలు తెలుగులోకి అనువాదమై ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మరో తమిళ చిత్రం ‘రంగోలీ‘ తెలుగులో ‘సత్య‘ పేరుతో విడుదలవుతోంది.

ఈ సినిమాతో సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా మారారు. ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ కె.బాబు రెడ్డి, జి.సతీష్ కుమార్ సమర్పణలో శివ మల్లాల.. శివమ్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హమరేష్, ప్రార్థన, ఆడుకాలమ్ మురుగ దాస్, అమిత్ భార్గవ్, సంజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. మే 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సత్య‘ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. స్కూల్, ఆట పాటలు, ప్రేమ, పేదరికం.. ఇలాంటి అంశాలతో ఎంతో సహజత్వంతో కూడిన టేకింట్ తో ‘సత్య‘ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది

Related Posts