ఓ మైగాడ్.. దేవుడి సినిమాకు ఏ సర్టిఫికెట్, 20కట్స్

ఓ మైగాడ్.. కొన్నాళ్ల క్రితం అక్షయ్ కుమార్, పరేష్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా. కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ పెద్ద విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ వెంకటేష్ లతో గోపాలా గోపాలాగా రీమేక్ చేశారు. తెలుగులోనూ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు.

‘ఓ మై గాడ్2’ అంటూ వస్తోన్న ఈ చిత్రంలోనూ అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఆయనతో పాటు పంకజ్ త్రిపాఠీ మరో కీ రోల్ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మూవీ సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో వస్తోందట. అక్షయ్ కుమార్ శివుడిని పోలిన పాత్రలో నటించాడు. ఆగస్ట్ 11న ఈ సెకండ్ పార్ట్ ను విడుదల చేయబోతున్నారు.

అయితే ఈ సినిమా సెన్సార్ విషయంలో అనేక సమస్యలను ఫేస్ చేస్తోంది. ఇప్పటికే చాలాసార్లు స్క్రీనింగ్ చేశారట. అసలే దేవుడి సినిమా. ఇప్పుడు దేవుడు పాత్రలను టచ్ చేయాలంటే కాస్త భయంగానే ఉంది మేకర్స్ కు. అంతా దేవుడి దయే అన్నట్టుగా ఉంటే ఫర్వాలేదు. ఏ మాత్రం చిన్న విమర్శ వచ్చినా.. మేకింగ్ లో తేడాలు వచ్చినా.. ఆదిపురుష్ లా అయిపోతుంది పరిస్థితి.దీనికి తోడు రీసెంట్ గా వచ్చిన ఓపెన్ హెయిమర్ లో ఓ సెక్స్ సీన్ తర్వాత భగవద్గీత వినిపించే సీన్ ను సెన్సార్ వాళ్లు అలాగే వదిలేశారు. దీంతో ఓ మై గాడ్ 2ను ఒకటికి రెండుసార్లు చూసి మరీ సెన్సార్ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు.


సెన్సార్ సర్టిఫికెట్ చూసిన వాళ్లంతా హవ్వ ఇదేం విడ్డూరం అంటున్నారు. ఎందుకంటే సెన్సార్ వాళ్లు ఈ చిత్రాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. దీనికి తోడు ఏకంగా 20 కట్స్ కూడా చెప్పారట. అయితే సెన్సార్ నిర్ణయం మేకర్స్ కు నచ్చలేదట. ఈ మేరకు బోర్డ్ తో ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే సినిమాను ఆగస్ట్ 11 నుంచి పోస్ట్ పోన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారట.

సో నెక్ట్స్ స్టెప్ రివైజింగ్ కమిటీకి వెళతారు. అయితే అసలు దేవుడు పాత్రతో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలనుకోవడమే విడ్డూరం అంటే దీనికి సెన్సారింగ్ పై గుస్సా కావడం ఏంటో అంటున్నారు కొందరు. ఏదేమైనా ఇప్పుడు దేశంల దేవుడు రాజ్యం నడుస్తుంది. మరి ఇట్టాంటప్పుడు ఆయన మీద సెటైర్స్ వేస్తే ఆయన భక్తులు ఊరుకుటారా.. థియేటర్స్ బద్ధలైపోవూ..?

Related Posts