HomeMoviesటాలీవుడ్జవాన్ తో కాదు.. జైలర్ తో అల్లు అర్జున్

జవాన్ తో కాదు.. జైలర్ తో అల్లు అర్జున్

-

ఇప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమా అనేది కామన్ అయిపోయింది. అందుకే ఏ ఇండస్ట్రీలో అయినా ఓ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు మరో ఇండస్ట్రీలో టాప్ హీరోలకు కథలు చెప్పడం చాలా సులువైంది. ఫస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్ గా తెలుగు సినిమా హిస్టరీలో శాశ్వత కీర్తిని సంపాదించిన అల్లు అర్జున్ ప్రస్తుతం తనకు ఆ అవార్డ్ తెచ్చిన పుష్పకు సీక్వెల్ చేస్తున్నాడు.

పుష్ప ది రూల్ అంటూ రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ లో ఉంది. తర్వాత త్రివిక్రమ్ తో సినిమాకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఆల్రెడీ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ ను కూడా వెంటనే సెట్ చేసుకోవాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. ఈ మేరకు జవాన్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అట్లీతో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. బట్ వాటితో పాటు లేటెస్ట్ గా జైలర్ దర్శకుడి గురించి కూడా న్యూస్ వస్తోంది.

జైలర్ తో రజినీకాంత్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ రీసెంట్ గా అల్లు అర్జున్ ను కలిసి ఓ కథ చెప్పాడట. కథ బన్నీకి బాగా నచ్చిందని టాక్. అయితే తను చేస్తున్నాడా లేదా అనేది ఇంకా చెప్పలేదట. విశేషం ఏంటంటే.. అట్లీ అతనికి కేవలం లైన్ మాత్రమే చెప్పాడు. ఇంకా పూర్తి కథ చెప్పలేదు. ఒకవేళ అతనూ కథ చెబితే ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనుకుంటే దర్శకుడికి ఓటేస్తాడు అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా ఎవరైనా ఎక్కడైనా ఓ బ్లాక్ బస్టర్ కొడితే మన హీరోలకు కథలు చెప్పొచ్చు అనేందుకు ఇదో సిగ్నల్ గా అనుకోవచ్చు. ఇంతకీ అల్లు అర్జున్ జవాన్ డైరెక్ట్ కు ఓకే చెబుతాడా.. జైలర్ డైరెక్టర్ కు ఓకే చెబుతాడా.. అసలు ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు..

ఇవీ చదవండి

English News