భోళా శంకర్ పై కొత్త పంచాయితీ..

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాపై కొత్త పంచాయితీ మొదలైంది. ఈ సినిమా నిర్మాత విషయంపై అభిషేక్ నామా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశాడు. ఒకప్పుడు తనకు ఎన్నో మెమరబుల్ హిట్స్ ఇచ్చిన నిర్మాత కేఎస్ రామారావు ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. అతన్ని ఆదుకోవడానికి భోళా శంకర్ నిర్మాణంలో భాగస్వామ్యం ఇవ్వమని చెప్పాడు చిరంజీవి.

ఆ మేరకు ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలుగా నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ పేర్ల నుంచి కేఎస్ రామారావు పేరు తొలగించారు. ఇదే అభిషేక్ నామాకు అభ్యంతరం అయింది. ఈయన పేరు తీస్తే ఆయనకు అభ్యంతరం ఏంటీ అంటే.. కేఎస్ రామారావు.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో అభిషేక్ కు బాకీ ఉన్నాడట. ఆ బాకీని ఇప్పటి వరకూ చెల్లించలేదు. ఒకవేళ కేఎస్ రామారావు పేరు నిర్మాతగా ఉండి ఉంటే.. తన బాకీ తీర్చేవరకూ సినిమా విడుదల చేయొద్దు అంటూ అవసరమైతే కోర్ట్ వరకూ వెళ్లొచ్చు. కానీ ఇప్పుడా అవకాశం లేదు. ఇది కావాలనే చేశారు కాబట్టి తనకు న్యాయం చేయాలని అభిషేక్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశాడు..


కేఎస్ రామారావు పేరు నిర్మాతగా లేదు కాబట్టి.. ప్రస్తుతం భోళా శంకర్ విడుదలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాకపోతే కౌన్సిల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కూడా కీలకమే. ఇలాంటి సందర్భాల్లో కౌన్సిల్ సామరస్యంగా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. సో.. కేఎస్ రామారావు, అభిషేక్ నామాల మధ్య రాజీ కుదర్చడమో లేక బాకీ తీర్చేందుకు ఇంకేదైనా ప్రత్యామ్నాయాన్ని సూచిండమో జరుగుతుంది. బట్ ఈ విషయంతో భోళా శంకర్ విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు.

Related Posts