విడుదలకు ముస్తాబవుతోన్న ‘లగ్గం’

తెలుగు కల్చర్ తో జరిగే పెళ్లిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలాచేస్తుంది. పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే. ఇప్పుడు అలాంటి పెళ్లిసందడి నేపథ్యంలో రూపొందిన చిత్రమే ‘లగ్గం’.

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా ‘లగ్గం’. రమేశ్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ‘లగ్గం’ చిత్రం టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుందట.

Related Posts