అక్కినేని నాగార్జున బర్తే డే స్పెషల్ గా ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. మళయాలంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ అనే చిత్రానికి రీమేక్ గా రూపొదుతోన్న ఈ మూవీకి ” నా సామిరంగా ” అనే మాస్ టైటిల్ పెట్టారు.
ఈ టైటిల్ నాగార్జునకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. టైటిల్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ లో నాగార్జున మాస్ లుక్ తో సిగరెట్ వెలిగించుకున్న ఫోటో విడుదల చేశారు. లాంగ్ కర్లీ హెయిర్ తో నాగ్ ఈ సారి ష్యూర్ గా కొట్టబోతున్నాడా అనే పాజిటివ్ వైబ్ తో ఈ లుక్ ఉందని చెప్పాలి.
ఇక టైటిల్ తో పాటు ముందు నుంచీ చెబుతున్నట్టుగానే ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే నాగార్జున ఈ సారి గట్టిగానే కొట్టబోతున్నాడు అనేలా ఉంది. ఓ హాల్ లో యాభై మంది రౌడీలను పోగేసినట్టుగా ఒక వ్యక్తి చెప్పడం.. వాళ్లు పులులు అనడం.. ఆ హాల్లోకి దర్శకుడు కరుణ కుమార్ ఎంట్రీ ఇవ్వగానే ఆ జనమంతా అన్నా ఆడి కాళ్లు తీయాలా,, చేతులు తీయాలా అనడం.. వాడి పేరేంటీ అనగానే పక్కన కింగ్ ఫిషర్ బీర్ లోని కింగ్ కనిపించడంతో పాటు వారి మధ్యే ఉన్న నాగ్.. ఎంట్రీ.. ఇదంతా ఊరమాస్ గా అదిరిపోయింది.
ఇంకేముందీ.. బయట ఉన్న వ్యక్తి వాళ్లు పులులు కాదురా.. మేకలు అనడంతో నాగ్ ఆ మేకల్ని ఏసేస్తాడు. ఇదీ వీడియో సెటప్. చివర్లో పగిలిపోయిన బల్బ్ లోని ఫిలమెంట్ తో నాగ్ బీడీ వెలిగించుకోవడం మాస్ కు పూనకాలే అనిపిస్తుంది. చివర్లో నాగ్ ” ఈ సారి పండక్కి నా సామిరంగా ” అనడం అదిరిపోయింది.
పోస్టర్ లో 2024 సంక్రాంతికి వస్తున్నాం అనే మాటను యాడ్ చేశారు.
ఇక కింగ్ మాస్ జాతర మొదలు అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు కీరవాణి రేంజ్ వేరే ఉంది. కాబట్టి నాగ్ కు అది మరింత ప్లస్ అవుతుంది. ఇక నాగార్జునకు ఇది 99వ సినిమా.
ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు నాగ్. కొన్నాళ్లుగా ఆశించిన విజయాలు రావడం లేదు. అందుకే ఈ సారి ఖచ్చితంగా కొట్టాలి అనే కాస్త ఆలస్యమైనా రీమేక్ తో వస్తున్నాడు.నిజానికి ఈ ఒరిజినల్ మూవీని తెలుగులో బాగా అడాప్ట్ చేయొచ్చు. అందుకే నాగ్ కూడా ఓకే చెప్పినట్టున్నాడు.